గొర్రెలని మాంసం కోసం పెంచుతూ ఉంటారు, వీటి వినియోగం ఎక్కువ కాబట్టి పల్లె నుంచి గ్రామాలు పట్టణాల్లో కూడా వీటిని నిత్యం ఎగుమతి చేస్తూ ఉంటారు, ఇక వీటి ధర కూడా తక్కువ ఏమీ కాదు, వేలల్లో ఉంటుంది, బలమైన గొర్రెలు ఏకంగా లక్షల రూపాయలు కూడా ధర పలుకుతాయి.
అయితే, స్కాట్లాండ్ లో స్కాటిష్ లైవ్ స్టాక్ లో గొర్రెలను వేలం వేస్తుంటారు. ఈ వేలంలో డబుల్ డైమండ్ అనే గొర్రె ఏకంగా రూ.3.5 కోట్లు పలికింది. వినడానికి షాక్ అయ్యేలా ఉంది కదా ఇది ముమ్మాటికి నిజం, అందరూ షాక్ అయ్యారు, అయితే ఎందుకు దీనికి ఇంత ఖరీదు అంటే కారణం ఉంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా ఇది పేరు తెచ్చుకుంది. అంతకు ముందు ఇదే జాతికి చెందిన ఓ గొర్రె 2,31,000 స్టెర్లింగ్ పౌండ్ల ధర పలికింది. చార్లీ బోడెన్ అనే వ్యక్తి వీటిని పెంచుతూ నేడు అమ్మాడు. అయితే దీనిని వారు ఏం చేస్తారో ఎవరికి తెలియదట.కొనుక్కున్న వ్యక్తి ఇది అరుదైన జాతి అని ఆ రేటు ఇచ్చాడట.