ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న సంఘటన…

ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న సంఘటన...

0
85

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది… కొవ్వూరు మండలంకు చెందిన నరసయ్య ఇటీవలే కరోనాతో మృతి చెందారు… ఇంట్లో కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు అతని భార్య పిల్లలు… బాధలో ఉన్నవారిని పలుకరించేందుకు బంధువులు సన్నిహితులు రాలేదు…

కరోనా భయంతో ఎవ్వరు వారి ఇంటి గడప తొక్కలేదు దీంతో తమను అంటరానివారుగా చూస్తున్నారనే భావన వారిలో పెరిగింది… ఆ బాధతోనే నరసయ్య భార్య సునీత అతని కుమారుడు 25 ఏళ్ల ఫని కుమార్ 22 ఏళ్ల కుమార్తే అపర్ణ గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు…

నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం వల్లే వారందరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అంటున్నారు.. రైల్వే బ్రిడ్జిపై నుంచి ముగ్గురు గోదావరి నదిలోకి దూకడంతో గల్లంతు అయ్యారు… ప్రస్తుతం గోదావరి నది ఉదృతంగా ఉండటంతో గల్లంతు అయిన వారికోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..