ప్రేమ జంటకు మద్దతు ఇచ్చినందుకు…. ఓ యువకుడి ప్రాణం తీసిన బంధువులు…

ప్రేమ జంటకు మద్దతు ఇచ్చినందుకు.... ఓ యువకుడి ప్రాణం తీసిన బంధువులు...

0
107

ఇద్దరు మైనర్లు ప్రేమించుకుంటున్నారు… వారికి ఒక వ్యక్తి మద్దతు ఇచ్చినందుకు యువతి బంధువులు అతనిపై కక్షకట్టి దాడి చేశారు… ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండంమెట్టవద్ద జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

ఓ యువతి యువకుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.. వారిద్దరికి పెద్దలు అడ్డువస్తున్నారు… అయితే ప్రవీణ్ అనే యువకుడు ఆ ప్రేమ జంటకు మద్దతుగా నిలిచాడు… వారి ప్రేమకు అతడు సహకరిస్తూ ఉండటంతో యువతి బంధువులు అతనిపై కోపం పెంచుకున్నారు…

ఈ క్రమంలో అతనిపై దాడి చేశారు… తీవ్ర గాయాలతో ఉన్న ప్రవీణ్ ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు… ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…