ప్రేమ పెళ్లి – క‌రోనా అన‌గానే వ‌దిలేశాడు – చివ‌ర‌కు ఆమె దారుణం

ప్రేమ పెళ్లి - క‌రోనా అన‌గానే వ‌దిలేశాడు - చివ‌ర‌కు ఆమె దారుణం

0
139

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట, ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన ఈ జంట భ‌ర్త చేసిన ప‌నికి పాపం ఆమె బ‌లైపోయింది.బెంగళూరులోనే ఈ ఘోరం జరిగింది. 27 ఏళ్ళ గౌరిమంజునాథ్‌ రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇక్క‌డ అద్దె ఇంట్లో ఉంటున్నారు, భార్య షాపింగ్ మాల్ లో ప‌ని చేస్తుంది, భ‌ర్త డ్రైవ‌ర్ గా చేస్తున్నాడు, ఇటీవ‌ల ఆమెకి ఒంట్లో బాగాపోతే ఆమె క‌రోనా టెస్ట్ చేయించుకుంది, ఆమెకి పాజిటీవ్ అని తేలింది.
భర్త మరుక్షణమే భార్యను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆమెకు శ్వాసకోశ సమస్య అధికం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు.

దీంతో ఆమె ఇంట్లో మ‌ర‌ణించింది, భ‌ర్త‌కు ఇంటి ఓన‌ర్ ఫోన్ చేసినా రాలేదు, చివ‌రకు ఫోన్ స్విఛ్చాఫ్ చేశాడు, ఇక ఆమె పేరెంట్స్ కు ఫోన్ చేస్తే వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమెని వ‌దిలేశాం అని చెప్పారు, దీంతో కార్పొరేటర్‌ తదితరులే కార్పొరేషన్‌ అంబులెన్స్‌ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు. చూశారుగా ఇలా క‌రోనా మాన‌వ సంబంధాల‌ను మంట‌క‌లిపేస్తోంది.