ప్రేమించాడ‌ని అది తాగించారు మ‌రో అమానుషం

ప్రేమించాడ‌ని అది తాగించారు మ‌రో అమానుషం

0
78

ప్రేమ‌ని క‌లిపేవారి కంటే విడ‌దీసేవారు ఎక్కువ మంది ఉన్నారు… కులం మ‌తం ఇలా అనేక అడ్డుగోడ‌లు ఉంటాయి, రెండు కుటుంబాలు ఒప్పుకున్నా స‌మాజంలో కొంద‌రు మాత్రం దీనిని జీర్టించుకోలేరు, అందుకే త‌ల్లి దండ్రులు కూడా ఇంకా ప్రేమ పెళ్లిళ్ల‌కు నో చెబుతున్నారు.

మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావంటూ.. ఓ యువకుడిని తీవ్రంగా చితకబాది, బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని శిరోహిలో చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంకా ఇలాంటి దుర్మార్గాలు చేసే వారు ఉన్నారా అనేలా ఉంది ఈ ఘ‌ట‌న‌.

శిరోహి జిల్లాకు చెందిన ఓ యువకుడు.. తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరివి ఒకే కులాలు. కాని వీరి కుల పెద్ద‌లు వీరి ప్రేమ‌ని ఒప్పుకోలేదు, అత‌నిని చిత‌క బాదారు షూలో నీరు పోసి తాగించారు, సీసాలో మూత్రం పోసి బ‌ల‌వంతంగా తాగించారు ఇక్క‌డ దుర్మార్గులు, ఇవి సోష‌ల్ మీడియా‌లో వైర‌ల్ అవ్వ‌డంతో ఆ యువ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు, దీంతో ఆరుగురిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.