న్యూ ఇయర్ షాక్..జనవరి నుంచి వీటి ధరలు పెరగనున్నాయ్..!

0
112

జనవరి 1 నుంచి వస్తు సేవల పన్నులో పలు మార్పులు రానున్నాయి. ఇందువల్ల పలు వస్తువుల సేవలు ఒకటో తేదీ నుంచి ప్రియం కానున్నాయి. 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పలు సేవలు, వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ స్లాబుల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేసింది. అందులో ప్రధానంగా వస్త్రాలు, చెప్పులు, జొమాటో, స్విగ్గీ సేవలు, ఊబర్‌, ఓలా రవాణా సేవలపై కూడా జీఎస్టీ భారం పడనుంది. ఈ మార్పులన్నీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి అమలులోకి వస్తాయి.

జనవరి 1 నుంచి అన్ని రకాల వస్త్రాలు, రెడీమెడ్‌ దుస్తుల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై ఉన్న 5% జీఎస్టీకి అదనంగా మరో 7% శాతం జోడించి… 12 శాతానికి పెంచనుండటమే ఇందుకు కారణం.

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ ఇకపై నేరుగా కస్టమర్‌ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి. గతంలో జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవి. జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదు.

పన్ను చెల్లింపుదార్లు జీఎస్టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త సంవత్సరం నుంచి ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఇకపై అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం జీఎస్టీ విధించినున్నట్లు జీఎస్టీ మండలి ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.1000కు పైన ఉండే ఫుట్‌వేర్‌కు 5 శాతం జీఎస్టీ వర్తించేంది. ఇకపై ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల ఫుట్‌వేర్‌పై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు. దీంతో చెప్పులు, షూస్‌ ధరలు వచ్చే ఏడాది నుంచి పెరగనున్నాయి.