ప్రియుడితో కలిసి భర్తను కారుతో తొక్కించి చంపిన భార్య….

ప్రియుడితో కలిసి భర్తను కారుతో తొక్కించి చంపిన భార్య....

0
93

తన ప్రియుడితో కలిసి భర్తను కారుతో తొక్కించి చంపేపించింది భార్య… ఆ సంఘటన కడప జిల్లా మైదుకూరులో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నూల్ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్ తులసి నాయక్ సాలిభాయి 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు…

నాలుగేళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం భార్య భర్తలు మైదుకూరు ప్రాంతానికి వచ్చారు.. అయితే అక్కడ మన్యంవారి పల్లేకు చెందిన మూడె రెడ్డి నాయక్ తో సాలిబాయ్ కి పరిచయం ఏర్పడింది… ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది…

ఈ నేపథ్యంలో తమ బంధానికి భర్త అడ్డువస్తున్నారనే ఉద్దేశంతో సాలిబాయి మూడె రెడ్డినాయక్ తో కలిసి భర్తను హతమార్చింది… ప్లాన్ ప్రకారం భర్త హత్య చేసింది… పైగా తన భర్తకు స్థానికంగా ఉన్న పెద్దపుల్లయ్య కారణం అని చెప్పుకొచ్చింది… దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించారు దీంతో అసలు విషయం వెలుగు చూసింది…