వివాహం అయిన తర్వాత భార్య కు పెళ్లికి ముందు మరొకరితో లవ్ ఉంది అని తెలిస్తే మండిపడతారు ఈ రోజుల్లో భర్తలు అసలు ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తారు.. నన్ను మోసం చేసి వివాహం చేసుకున్నావు అంటారు ఇక విడాకులు తీసుకున్న ఘటనలు ఉన్నాయి.. ఇలాంటి కేసులు చాలా వరకూ మనం వింటూనే ఉంటున్నాం …అయితే ఓ భర్త మాత్రం తన భార్యకు పెళ్లికి ముందు ప్రియుడు ఉన్నాడు అని తెలిసి ఏకంగా అతనిని ఇచ్చి వివాహం జరిపించాడు.
అయితే అతను కూడా ఆమెని ప్రేమిస్తున్నాడు తనకు ఓ కుమార్తె ఉంది అయినా సరే ఆమె ప్రియుడిని ఇంటికి పిలిచి మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోండి.. ఆనాడు ఆమె తండ్రి మీ పెళ్లికి నో చెప్పాడు తర్వాత నాకు కన్యాధానం చేశాడు.. ఇక ఆమెకు నీకు లవ్ ఉంది అని నాకు తెలిసింది. ఇంకా నీ ఆలోచనలతో ఆమె ఉంది.
అందుకే నువ్వు ఆమె ఒకటి అవ్వాలి అని తెలిపాడు, బీహర్ లోని బెరగాన్ ప్రాంతంలో ఓ అమ్మవారి ఆలయంలో వారిద్దరికి మళ్లీ పెళ్లి చేశాడు ఆమె భర్త , అయితే దీనిపై ఆమె తండ్రి ఇప్పుడు అల్లుడిపై కేసు నమోదు చేశాడు, ఇక ఆ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.