ఈ దేశాల్లో ప్రేమికుల రోజుపై నిషేధం!

0
114

ప్రపంచమంతా ప్రేమ దుప్పటి కప్పుకునే రోజు నేడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భార్యాభర్తలైనా.. ప్రేమికులైనా వాలంటైన్స్ డే రోజున తమ ప్రేమను తెలియబరుస్తారు. కానీ కొన్ని దేశాల్లో ప్రేమికుల రోజును నిషేధించారు. ఆ దేశాలంటే ఇప్పుడు చూద్దాం..

వాలెంటైన్స్ డేకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అయితే కానీ కొన్ని దేశాలు మాత్రం ప్రేమికుల రోజుని వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్‌లో వాలెంటైన్స్ డైపై నిషేధం ఉంది. ప్రేమికుల రోజు ఇస్లాంకు వ్యతిరేకం అని సౌదీ అరేబియా కూడా దీన్ని నిషేధించింది.

రష్యా, ఇరాన్​ దేశాల ప్రభుత్వాలు కూడా ప్రేమికుల రోజుకు పూర్తి విరుద్ధం. భారతదేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వాలెంటైన్స్ డేతో విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతుందని వాళ్లు చెప్తున్నారు.