ISI కోల్ కతాలో ప్రాజెక్ట్‌ లింక్డ్‌ పర్సన్స్‌ పోస్టులు..నెలకు వేతనం ఎంతంటే?

0
110

భారత ప్రభుత్వ స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌  తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ లింక్డ్‌ పర్సన్స్‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 08

అర్హులు: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాదించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు: 2022 మే 01 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం: నెలకు రూ.28,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: మే 27, 2022