పబ్లిక్ టాయిలెట్ లో బార్బర్ ఆత్మహత్యయత్నం… రీజన్ తెలిస్తే కన్నీరు ఆగవు..

పబ్లిక్ టాయిలెట్ లో బార్బర్ ఆత్మహత్యయత్నం... రీజన్ తెలిస్తే కన్నీరు ఆగవు..

0
115

పూణేలో లాక్ డౌన్ కారణంగా పని లభించక పోవడంతో తీవ్ర నిరాశకులోనైన ఒక బార్బర్ భహిరంగంగా మూత్ర విసర్జనశాలలో ఆత్మహత్యాయత్నం చేశాడు… పూణేలో సెలూన్ నడుపుతున్న జైరామ్ గైక్వాడ్ అనే వ్యక్తి కత్తెరతో కడుపులో పొడుచుకున్నాడు..

దీంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి… ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు… జైరామ్ తన ఇంటికి సమీపంలో ఉన్నపబ్లిక్ టాయిలెట్ లో ఆత్మహత్యాయత్నం చేశాడు… దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు..

దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు… కాగా చాలా కాలంగా పని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎటువంటి సహాయం అందలేదని అందుకే జైరాం ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు…