పుస్తెలమ్మి అయినా పులస తినాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు, గోదావరి వారు పులస రుచి చాలా మందికి చూపిస్తారు, ఇక్కడ నుంచి హస్తని వరకూ వెళతాయి ఈ పులస చేపలు, అయితే సాధారణ చేపలు వందకి వస్తాయి, కాని సరైన పులస ఒక్కోసారి మార్కెట్లో 10 వేల నుంచి లక్ష కూడా పలుకుతుంది.
ఈ పులస చేపలు 365 రోజులు దొరకవు.. కేవలం వానాకాలంలో మాత్రమే దొరుకుతాయి, గోదావరిలో మరియు హుగ్లీ నదిలో మాత్రమే దొరుకుతుంది. మరి పులస చేపల స్టోరీ చూద్దాం.ఈ చేపలు ఆస్ట్రేలియా న్యూజీలాండ్ నుండి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణం చేసి బంగాళఖాతంలోకి ప్రవేశిస్తాయి.
ఇక ఇక్కడ నుంచి వరద పోటుకి భారీగా భద్రాచలం ధవళేశ్వరం మీదగా గోదావరి నది అంతర్వేది వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది, ఇక సముద్రంలో చేరిన చేపలు గోదావరి నదిలో ఈదుకుంటూ వెనక్కి వెళతాయి.
సముద్రంలో ఉన్న ఈ చేపలను విలసలు అంటారు, అక్కడ నుంచి ఇవి ఆ ఉప్పు నీరులో కాకుండా గోదావరి నీటిలో గుడ్లు పెడతాయి, అలా సముద్రపు నీటి నుంచి గోదావరిలో కి వచ్చి ఉంటాయి, ఆ నీరు వల్ల అప్పటి వరకూ ఉన్న ఉప్పు నీటిని తాగిన చేపలు గోదావరిలో రాగానే, మరింత రుచిగా గోదావరిలో మారతాయి, ఉప్పుగా ఉండే ఈ చేప అంత రుచి ఉండదు, గోదావరి నీటిలో ఉండటంతో అవి మరింత ఎదిగి జాలర్ల వలకు పడతాయి, ఇక ఆడచేపకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఇక ముల్లులు బాగా ఎక్కువగా ఉంటాయి…ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మధ్యలోనే దొరుకుతాయి ఈ పులసలు.
బెండముక్కలు చింతపండు గుజ్జు ఆవకాయ నూనె వేసి వండితే ఆటేస్ట్ అదిరిపోద్దు, ఇక పులస చేప మట్టి పాత్రలో వండాలి మర్చిపోకండి, కచ్చితంగా తర్వాత రోజు తినండి ఆ పులుపుతో మరింత టేస్ట్ వస్తుంది.