ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ ప్రాంతం వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణముంటుందందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల చలి తీవ్రత పెరుగుతోందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా తానూరు(నిర్మల్ జిల్లా)లో 10.9 డిగ్రీలుంది. ఉదయం పూట పలు చోట్ల పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 16 శాతం అదనంగా పెరిగింది.