ఏపీకి వర్ష సూచన…ఈ జిల్లాలో భారీ వర్షాలు..!

0
131

ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం..శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఈ మేరకు తెలియజేసింది.