హైదరాబాద్ లో మరోసారి దంచికొట్టిన వర్షం..

0
110

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే కురిసిన వర్షాలతో ఉదయాన్నే కార్యాలయాలకు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనం కాస్త ఇప్పుడిప్పుడే వర్షాలు కారణంగా జరిగిన నష్టం నుంచి కోలుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌లో మరోసారి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరతలద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా..రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఎల్బీ నగర్, సరూర్‌నగర్‌, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, ముసారాంబాగ్, మలక్ పేట, ఖైరతాబాద్, లక్డీ కా పూల్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్​పేట్ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.