హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

Rain in many places in Hyderabad

0
105

హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గత రెండు మూడు రోజులుగా ఉక్కబోతలో ఉన్న ప్రజలు వర్షంతో వారికి ఉపశమనం అయింది.