డాక్టర్ అనితారాణి కేసు విషయంలో నిజాలను వెలికి తీసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది.. ఈ రోజు సీఐడీ అధికారులు చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు.. పెనుమూరు పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీ అధికారులు కేసును హ్యాండోవర్ చేసుకుని దర్వాప్తు చేస్తున్నారు… కాగా వైసీపీ నేతలు డాక్టర్ సుధాకర్ లాగానే తనను నిర్భందించి వేధించారని చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనితారాణి అరోపించిన సంగతి తెలిసిందే…
కొద్దికాలంగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు… ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకున్నారని ఆమె వాపోయింది… తనపై స్ధానిక అధికారి పార్టీనేతలు జనతా కర్ఫ్యూ రోజున తనను ఓ గదిలో బంధించి రకరకాలుగా వేధించారని తెలిపింది…
అంతేకాదు వాష్ రూమ్ లో తన ఫోటోలు వీడియోలు తీసి మానసికంగా వేధింపులకు గురి చేశారని తెలిపింది… అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు…