తెలంగాణలో మరో దారుణం జరిగింది… అచ్చం దిశ సంఘటన తరహాలో ఈ సంఘటన చోటు చేసుకుంది… ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వివాహితను బైక్ పై కిడ్నాప్ చేసి పత్తిచేనులో ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు…
వివాహితను కిడ్నాప్ చేసే సమయంలో స్థానికంగా ఉన్న ఓ యువతి గమనించడంతో ఈ విషయం వెలుగు చూసింది… ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది… దీంతో రంగంలో కి దిగిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు…
మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చేస్తున్నారు… నింధితులు కొందరు హర్యాతండాకు చెందిన వారుగా గుర్తించారు మరికొందరు సుకినీ తండాకు చెందిన వారుగా గుర్తించారు… బాణోతు మోహన్, బాణోతు ఉపేంద్ర అంగోతు కళ్యాణ్ బానోతు చంటి అజ్మిరా నాగేశ్వరరావు, మాలోతు అశోక్ బి. సునీల్ గా పోలీసులు గుర్తించారు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…