తెలంగాణలో మరో దారుణం చిన్నారిపై లైంగిక దాడి….

తెలంగాణలో మరో దారుణం చిన్నారిపై లైంగిక దాడి....

0
92

తెలంగాణలో మరో దారుణం జరిగింది…. గుర్తు తెలియని వ్యక్తి చిన్నారికి పానీ పూరి ఇప్పిస్తానని చెప్పి నమ్మించి బాత్ రూమ్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు… ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది… ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఎస్ ఆర్ నగర్ లో ఒక గుడిసేలో ఉంటూ చెత్త ఏరుకుంటూ జీవిస్తున్నారు చిన్నారి తల్లి దండ్రులు…

ఈక్రమంలో ఒక వ్యక్తి వచ్చి పానీపూరి ఇప్పిస్తానని చెప్పాడు దీంతో ఈ విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పింది… ఎక్కడకు వెళ్లోద్దని చెప్పి భోజనం పెట్టి ఇంట్లో పడుకోబెట్టింది తల్లి… కొద్ది సేపటి తర్వాత చిన్నారి ఇంట్లో కనిపించకపోవటంతో చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికింది…

ఈఎస్ఐ శ్యామల కుంటపార్క్ లో సెక్యూరిటీ సిబ్బంది దగ్గరకు వచ్చి ఆరా తీసింది… ఓ వ్యక్తి పాప బాబుతో పార్క్ లోని బాత్రూం వద్ద కనిపించాడని తానే అతడిన అక్కడినుంచి పంపేశానని సమాధానం ఇచ్చారు.. దీంతో పార్కులో వెతుక్కుంటూ వెళ్లింది అక్కడ నిందితుడు కనిపించాడు ఏం జరిగిందని పాపను అడగగా అసులు విషయం చెప్పింది… దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు నాగరాజుపై ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు….