తల్లి నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తే తండ్రి ఆ పిల్లలకు ఏ లోటు రాకుండా భద్రతను ఇస్తారు… అలా కాకుండా ఓ తండ్రి బాధ్యతా రహితంగా ప్రవర్తించాడు…. తన సొంత కూతురుపై లైంగిక దాచి చేశాడు… ఈ దారుణం చెన్నైలోని అవడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది…
తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నారని 16 ఏళ్ల ఓ బాలిక పోలీస్ స్టేషన్ అత్యవసర నెంబర్ కు సమాచారం అందించింది… దీంతోరంగంలోకి దిగిన పోలీసులు బాలిక వివరాలు తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లారు… అక్కడ బాలికను విచారించగా తన తండ్రి కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా తెలిపింది…
ఇంటి దగ్గర తండ్రి లేకపోవడంతో కుటుంబ సభ్యుల ద్వారా ఫోన్ చేయించి అతడిని రప్పించుకున్నారు… అ తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు… విచారణలో తన ఆయుష్షు గట్టిగా ఉండటంకోసమే తన కుమార్తె పై అలా ప్రవర్తించానని చెప్పాడు…