రాసలీలలు చూశాడ‌ని చిన్నారిన చంపిన జంట

రాసలీలలు చూశాడ‌ని చిన్నారిన చంపిన జంట

0
94

ఈ రోజుల్లో మ‌నుషులు కొంద‌రు ప‌శువుల కంటే దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు… ఇటీవ‌ల ఏకంగా కొంద‌రు ఏనుగుని కూడా దారుణంగా చంపేశారు, ఇక ప‌శువుని కూడా బాంబు పెట్టి దాని ద‌వ‌డ పేల్చేశారు. ఇలాంటి దారుణాలు ఎన్నో జ‌రుగుతున్నాయి, అంతేకాదు మ‌నుషుల్ని కూడా దారుణంగా చంపేస్తున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

ఓ ప్రేమ జంట తాము ఏకాంతంగా కలిసి ఉన్న సమయంలో ఓ బాలుడు చూశాడని.. తమ గుట్టు రట్టవుతుందని దారుణంగా చంపారు. ఈ దారుణ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఇంత దుర్మార్గానికి ఒడిక‌ట్ట‌డంతో అక్కడ విషాదం అల‌ముకుంది.

ఓ ప్రేమ జంట సీక్రెట్ గా క‌లుసుకున్నారు, ఈ స‌మ‌యంలో భవనేష్ అనే బాలుడు వీరిని చూశాడు, వెంట‌నే వారి సీక్రెట్ అఫైర్ తెలుస్తుంది అని ఆ బాలుడ్ని ప్రియురాలు తీసుకువెళ్లింది, వెంట‌నే అత‌నిని హ‌త్య చేసి కొల‌నులో పాడేసింది, పోలీసుల విచార‌ణ‌లో ఈ నిజం ఒప్పుకుంది.