హిందూవులపై దాడికి నిరసనగా రాస్తారోకో

Rastaroko in protest of the attack on the Hindus

0
102

మూడు రోజుల క్రితం క్రితం కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లో హిందూవులపై జరిగిన దాడిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు తీవ్రంగా ఖండించారు. ఇవాళ బాలాపూర్ చౌరస్తాలో గోరక్షకులపై దాడిని నిరసిస్తూ…బీజేపీ, బీజేవైఎం, హిందూధార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.

సాక్షాత్తూ హనుమాన్ దేవాలయంలో ముష్కరులు చొరబడి గోరక్షకులపై దాడి చేస్తే… స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవటం దారుణమన్నారు. పథకం ప్రకారం హిందూవులపై దాడులు చేస్తే పార్టీలకు అతీతంగా సంఘటితం కావాలని శ్రీరాములు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.