దిశ ఎన్ కౌంటర్ పై రాష్ట్రపతి ఏమన్నారంటే

దిశ ఎన్ కౌంటర్ పై రాష్ట్రపతి ఏమన్నారంటే

0
90

దిశ హత్య కేసు నిందితులు చటాన్ పల్లి దగ్గర సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై దాడి చేశారని దీంతో వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు అని చెప్పారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ .. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని . తర్వాత పోలీసుల నుంచి రెండు గన్లు తీసుకున్నారని.. కాల్పులు జరిపి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులని, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు.

మొత్తానికి పోలీసులు చేసిన చర్యపై యావత్ దేశం అంతా సపోర్ట్ చేస్తోంది, నిందితులకు సరైన శిక్ష పడింది అంటున్నారు, అయితే ఏడు సంవత్సరాలు అయినా కాని నిర్భయ ఘటనలో మాత్రం ఇంకా న్యాయం జరగలేదు, ఇలాంటి కేసులని 24 గంటల్లో శిక్షలు విధిస్తేనే ఇలాంటి వారిలో మార్పు వస్తుంది అని చెబుతున్నారు.. తాజాగా నిర్భయ ఘటన కేసు నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు అయితే వీరిలో ఒకరి క్షమాబిక్ష పిటిషన్ కూడా రాష్ట్రపతి దగ్గరకు వెళ్లింది అని తెలుస్తోంది. తాజాగా ఈ పిటిషన్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఇప్పటికే ఆయన దగ్గర కొన్ని క్షమాబిక్ష పిటిషన్లు ఉన్నాయి, తాజాగా ఆయన ఈ కామెంట్లు చేయడంతో కచ్చితంగా ఇలాంటి వారిపై సానుభూతి చూపేది లేదని దయ అక్కర్లేదు అని చెప్పడంతో వారి పిటిషన్లను కూడా తోసిపుచ్చే అవకాశం ఉంది అంటున్నారు న్యాయనిపుణులు.