ఓ వైపు ఈశాన్య రుతుపవనాల తిరోగమనం..మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస వాయుగుండాలు, అల్ప పీడనాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇప్పుడు కేరళ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేరళకు తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేరళకు రెడ్ అలెర్ట్ ను ప్రకరించింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కేరళ రాష్ట్రాన్ని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరువనంతపురంతో పాటు మూడు కేరళ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్ రెడ్ అలర్ట్‌లో ఉండగా.. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ వంటి ఎనిమిది జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది.