తెలంగాణకు రెడ్ అలెర్ట్..3 రోజులు అత్యంత భారీ వర్షాలు

0
98

ఇప్పటికే కురిసిన వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయింది. ఇక తాజాగా వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ హెచ్చరిక జారీ చేసినట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించిందన్నారు.

దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో అల్పపీడనం ఇందుకు కారణమని తెలిపారు.