తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం ఎంతంటే?

0
106

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో  భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్న విషయం తెలిసిందే.

కానీ తిరుమలలో భక్తుల రద్దీ శనివారంతో పోల్చుకుంటే ఆదివారం మోస్తరుగా తగ్గింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల తగ్గిన కూడా తిరుమల క్షేత్రం భక్తులతో సందడిగానే కనిపిస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చిందని టిటిడి వెల్లడించడంతో పాటు.. 27న 72,758, 28న 73.358 మంది, 29న 89,318 మంది, 30న 90,885 మంది భక్తులు, 31న 74,823 మంది దర్శించుకున్నారని వెల్లడించారు.