Breaking: ఏపీ ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల‌ షెడ్యూల్ విడుద‌ల

0
83

ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. కాగ గ‌తంలోనే పరీక్షల షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌గా.. జేఈఈ మెయిన్స్, ఇంట‌ర్ పరీక్ష కార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

అలాగే మే 9వ తేదీతో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ముగియ‌నున్నాయి. ఏప్రిల్ 27న తెలుగు ప‌రీక్ష, ఏప్రిల్ 28వ తేదీన సెకండ్ లాగ్వేంజ్, ఏప్రిల్ 29వ తేదీన ఇంగ్లీష్ ప‌రీక్ష ఉండ‌నుంది. అలాగే మే2 వ తేదీన గ‌ణితం, మే 4వ తేదీన సైన్స్ పేప‌ర్ – 1, మే 5వ తేదీన సైన్స్ పేప‌ర్ – 2 ఉండ‌నుంది. అలాగే మే 6వ తేదీన సోషల్ ప‌రీక్ష ఉండ‌నుంది. కాగ ఏప్రిల్ 30 తో పాటు మే 1 తేదీల్లో సెల‌వు దినాలుగా ఉండ‌న్నాయి. అలాగే మే 3 రంజాన్ ఉండ‌టంతో సెలువు ఉండ‌నుంది.