Breaking: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

Release of Srivari Sarvadarshanam tickets

0
85

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు దర్శనాల టికెట్లను ఆన్  లైన్ లో బుక్ చేసుకోవచ్చు. భక్తులు http://tirupatibalaji.ap.gov.in/ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మరోవైపు కరోనా కారణంగా సెప్టెంబర్ 25 నుంచి ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుండి ఆన్ లైన్ ద్వారానే దర్శన టికెట్లను తీసుకునే వీలుండేది. ఇప్పుడు తిరిగి త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి ప్రకియ ప్రారంభిస్తామని టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దీనితో తిరుమల వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత కలగనుంది.