తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు మే 11వ తేదీ నుంచి 17 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రతి పేపర్ లో 80 మార్కులకు బోర్డు ఎగ్జామ్, 20 మార్కులు ఇంటర్నల్ అస్సేస్మెంట్ ఉంటుంది. ఓఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ పరీక్షలను మే 18వ తేదీ నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది.





