తెలంగాణలో ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ పూర్తి కాగా ఇప్పుడు ఫార్మసీకి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు.
డిసెంబరు 1 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్, డిసెంబరు 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ, ఫార్మ్ డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది.
డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. డిసెంబరు 13న స్లాట్ బుకింగ్, 14న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. డిసెంబరు 13 నుంచి 15వరకు వెబ్ ఆప్షన్లకు వీలు కల్పించారు. డిసెంబరు 17న తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది. డిసెంబరు 19న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. పూర్తివివరాలకు https://tseamcetb.nic.in/లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.