రెండో ఎక్కం చెప్పమన్న పెళ్లికూతురు – చివరకు పెళ్లి ఆగిపోయింది

రెండో ఎక్కం చెప్పమన్న పెళ్లికూతురు - చివరకు పెళ్లి ఆగిపోయింది

0
105

పెళ్లి పీటల దాకా ఆ వివాహం వచ్చింది.. మరికొద్ది సేపట్లో వధువు వరుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి అవ్వబోతున్నారు.. అయితే వధువు వెంటనే ఓ విషయంలో నాకు ఈ వరుడు వధ్దు అని పెళ్లి పీటల నుంచి దిగిపోయింది, దీంతో ఇది పెద్ద వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనేది చూద్దాం.

 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్..మహోబాజిల్లా..పన్వారీ ఏరియాలోని ధావార్ గ్రామంలోని ఓ పెళ్లి జరుగుతోంది, అక్కడ అందరూ చాలా సరదాగా ఉన్నారు.. ఇక పెళ్లి పీటలపై కూర్చుంది వధువు.. పంతులుగారు మంత్రాలు చదువుతూ కొన్ని మంత్రాలు పెళ్లికొడుకుని అనమన్నారు.. అయితే నాకు ఇవి చిరాకు నేను పలకను అన్నాడు.

 

దీంతో ఆమె ఇవి చిన్న చిన్న మాటలు ఇవి పలకలేవా అని ప్రశ్నించింది. ఇక ఆమెని కూడా తిట్టాడు ఆమెకి కోపం వచ్చింది.. అనుమానంతో అసలు నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగి రెండో ఎక్కం చెప్పు అంది… ఇక మనోడు ముఖం తేలేశాడు. ఇక నీకు రెండో ఎక్కం రాదు నీ లాంటి వాడిని పెళ్లి చేసుకోను అని ఆమె చెప్పింది . అయితే అబ్బాయి చదువుకున్నాడు అని ముందు చెప్పారట, కాని తర్వాత ఇది నిజం కాదు అని తెలిసి ఆమె పెళ్లికి నోచెప్పింది.