రూ. 56 వేల జీతంతో ఉద్యోగాలు..టెన్త్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీ

Replacement of Indian Army Postal Service posts with Tent Qualification

0
43

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కంప్టీకి చెందిన ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌.. గ్రూస్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

మొత్తం పోస్టుల సంఖ్య: 2

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు: గ్రూస్ సీ (వాషర్‌మ్యాన్‌, గార్డెనర్‌) పోస్టులు

అర్హతలు: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: వింగ్‌ కమాండర్‌, ఏపీఎస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ కంప్టీ నాగపూర్‌, మహారాష్ట్ర-441001.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.