టెక్నీషియన్‌ ఉద్యోగాల భర్తీ..రూ.28,000 ల వరకు జీతం

0
90

ఏపీ: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్య సమాచారం మీకోసం..

మొత్తం ఖాళీల సంఖ్య: 14

ఖాళీల వివరాలు: పర్‌ఫ్యూజనిస్ట్‌-2, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌-2, సీటీ టెక్నీషియన్‌-2, డయాలసిస్‌ టెక్నీషియన్‌-4, కాథ్‌ లాబ్‌ టెక్నీషియన్‌-2, ఫార్మసిస్ట్‌-2 పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.17,500ల నుంచి రూ.28000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 500

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, రూం నెం 124, జీజీహెచ్‌, ఒంగోల్‌, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 4, 2022.