కొందరు దొంగలు వంద, వెయ్యి, లేదా లక్ష కొట్టేస్తారు, ఇంకొందరు బంగారం మాత్రమే వారి టార్గెట్, మరికొందరు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మూటా ముల్లు సద్దేస్తారు, ఇలా ఒక్కోక్కరు ఒక్కో సిగ్నేచర్ ఉంటుంది వారి దొంగతనాల్లో.. కాని ఇప్పుడు వీరి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
వీళ్లు మామూలు దొంగలు కాదు. హైటెక్ దొంగలు. భారీ స్కెచ్‌లు వేస్తారు. అవసరం అయితే ఫ్లైట్‌లలో వెళతారు. ఈ దొంగలు చివరకు పోలీసులకు చిక్కారు.. నగరానికి చెందిన ఓ వ్యాపారి మే నెలలో రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఫెరారీ కారును కొన్నారు.
రిజిస్ట్రేషన్ కోసం బ్రోకర్‌ను సంప్రదించారు. దీని పత్రాలు ఇచ్చారు, ఇవి ఢిల్లీలో ఉండే మరో వ్యక్తికి ఇచ్చాడు బ్రోకర్ .. అక్కడున్న వ్యక్తి ఆ పత్రాలను ఫోర్జరీ చేసి ఇంకో వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. కారును తీసుకు రావాలంటూ సదరు వ్యక్తి ఢిల్లీ నుంచి భూపేందర్, సద్దాం అనే ఇద్దరిని నగరానికి పంపించాడు.
చివరకు వారు ఫ్లైట్ లో హైదరాబాద్ నగరానికి వచ్చారు… స్థానికంగా ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు. అక్కడే ప్లాన్‌పై చర్చించుకుని.. కారు ఉన్న ప్రాంతానికి వెళ్లి దాన్ని దొంగలించారు. కారు చోరీకి గురైందని తెలుసుకున్న వ్యాపారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సీసీ టీవీల ద్వారా వారిని గుర్తించారు చివరకి అరెస్ట్ చేశారు, చూశారుగా ఎంత హైటెక్ ఆలోచనలతో దొంగతనాలు స్కామ్ లు మోసాలు చేస్తున్నారో జాగ్రత్త.