రైతు పొలంలో లంకె బిందె అందులో ఏమున్నాయంటే

రైతు పొలంలో లంకె బిందె అందులో ఏమున్నాయంటే

0
97

ఎక్కడైనా లంకె బిందెలు ఉన్నాయి అనే వార్త వింటే అందులో ఏమున్నాయా అని తెగ ఆలోచన… ఏమున్నాయో తెలుసుకోవాలి అనే ఆత్రుత ఉంటుంది… అయితే తాజాగా జనగామలో ఓ రైతు పొలంలో ఇలా లంకెబిందె దొరికింది అనే వార్త వినిపించింది, ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున చాలా మంది తెలుసుకుంటున్నారు.

 

పెంబర్తి దగ్గర నర్సింహా అనే వ్యక్తి తనకు చెందిన భూమిని చదును చేస్తుండగా ఓ లంకెబిందె లభ్యమైంది.

అందులో ఏముందా అని తీసి చూశారు, అందులో బంగారం ఉంది అని తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించారు.

 

 

దీంతో సమీప గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. 18 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు లభ్యమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని పోలీసులు సీజ్ చేశారు.