టెన్త్ విద్యార్థుల‌కు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త..

0
98

కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్షలు కేంద్రాలకు వెళ్లి రాయకపోవడంతో ఇంటర్నల్ మర్క్స్ ని ఆధారంగా తీసుకొని ర్యాంకులను నిర్దారించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కేంద్రాలకు వెళ్లి రాసే అవకాశం రావడంతో కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల సందడి నెలకొన్నది.

అయితే దీనికి తోడు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. బస్సులలో విద్యార్థులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తూ పేద విద్యార్థులకు కొంతమేరకు ఆదుకుంటున్నారు. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్ర‌యాణించేందుకు అవ‌కాశం కల్పించనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.

విద్యార్థులకు పరోక్ష కేంద్రాల వద్దకు తీసుకెళ్లడంతో పాటు..పరీక్షా ముగిసిన తరువాత కూడా బ‌స్సులో అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలంటే  విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ హాల్ టికెట్ల‌ను కండ‌క్ట‌ర్ల‌కు చూపించాల్సి ఉంటుంది. దాంతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వెసులుబాటులు కల్పిస్తున్నారు.