యాదాద్రిలో నేటి నుంచి పంచ‌కుండాత్మ‌క యాగం

0
99

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యంలో నేటి నుంచి పంచ‌కుండాత్మ‌క యాగం ప్రారంభం కానుంది. మ‌హా కుంభ సంప్రోక్షణ‌కు సోమ‌వారం అంకురార్ప‌ణ చేశారు. నిన్న అంకురార్ప‌ణతో యాగాలు మొదలు అయ్యాయి. కాగ నేటి నుంచి ప్రారంభం అయిన పంచ‌కుండాత్మ‌క యాగం.. వారం రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

దీనికి కోసం యాదాద్రి ఆలయంలో ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అందుకు 108 మంది పారాయ‌ణీకుల‌ను సిద్ధం చేశారు. ఈ యాగం ఈ రోజు ఉద‌యం 9 గంట‌లకు ప్రారంభం కానుంది. కాగ ఈ యాగంతో పాటు ఆల‌యంలో మూల మంత్ర జ‌పాలు, పారాయ‌ణాలు కూడా కొన‌సాగుతాయి. కాగ వారం రోజుల పాటు యాదాద్రి ఆల‌య ప్రాంగణం మొత్తం వేద మంత్రాలతో మార్మోగ‌నుంది.

నలువైపులా ఏర్పాటైన కుండాల మధ్య శ్రీ మహాలక్ష్మి నిర్వహించే యాగానికి పర్యవేక్షకులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. సాయంత్రం జరిగే క్రతువుల్లో సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, నిత్య విశేష హోమాలు ఉంటాయి. బాలాలయంలో యాగంతో పాటు ప్రధానాలయంలో మూల మంత్ర జపాలు, పారాయణాలు కొనసాగుతాయి.