ఏపీలోని మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-1, సీనియర్ రెసిడెంట్-1, కౌన్సెలర్లు-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్- 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 1, 2022.
అడ్రస్: మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ మంగళగిరి, ఏపీ.