సజ్జనార్ సొంత ఊరిలో ఎన్ కౌంటర్ తర్వాత గ్రామస్తులు ఏం చేశారో చూడండి

సజ్జనార్ సొంత ఊరిలో ఎన్ కౌంటర్ తర్వాత గ్రామస్తులు ఏం చేశారో చూడండి

0
81

దిశకు జస్టిస్ జరిగింది అని అందరూ భావిస్తున్నారు.. ఆమెకు న్యాయం చేశారు అని పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ సరైనదే అని అందరూ అంటున్నారు.. తెలంగాణ పోలీసులకు దేశం అంతా కితాబిచ్చింది. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తెలంగాణ పోలీసులని ప్రశంసించారు, అయితే ఈ కేసు ముందు నుంచి చూసున్న సీపీ సజ్జనార్ సొంత ఊరిలో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేశారు,
సజ్జనార్ ను అభినందిస్తూ వస్తున్న సందేశాలు, వ్యాఖ్యలకు లెక్కేలేదు. సోషల్ మీడియాలో ఆయన నిన్న హీరో అయ్యారు అనే చెప్పాలి

ఇక ఆయన సొంతూరు కర్ణాటకలోని అసుతి గ్రామంలో అయితే పండుగ వాతావరణం నెలకొంది.
ఆ దుర్మార్గులని ఎన్ కౌంటర్ చేశారు అని తెలియడంతో, అక్కడ ప్రజలు స్వీట్లు పంచుకున్నారు. అక్కడ కాలేజీ యువత కూడా ఆయన ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేశారు.

ఆయన సొంత ఊరు స్కూల్స్ లో పిల్లలు అందరూ ఆయన కు ధన్యవాదాలు చెప్పారు… అక్కడ మీడియా కూడా ఆయన గురించి ఆయన టేకప్ చేసిన కేసుల గురించి తెలియచేసింది. సజ్జనార్ ఇంటికి బంధుమిత్రులు, ఇతర గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చారు. దీనిపై సజ్జనార్ సోదరుడు ప్రకాశ్ స్పందించారు. తన సోదరుడు సజ్జనార్ ఎప్పుడూ సామాజిక న్యాయం గురించే తపించిపోయేవాడని, ఆయనకు నచ్చిన ఉద్యోగంలో వెళ్లి సర్వీస్ చేస్తున్నారు అని తెలిపారు.