SBI కస్టమర్లకు కొత్త సర్వీసులు ఖాతాదారులు మిస్ చేసుకోకండి

SBI కస్టమర్లకు కొత్త సర్వీసులు ఖాతాదారులు మిస్ చేసుకోకండి

0
83

SBI మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు, అంతేకాదు ఖాతాదారుల నమ్మకాన్ని సంపాదించిన బ్యాంకు, అందుకే కోట్లాది మందికి ఇందులో ఖాతాలు ఉన్నాయి, లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి, లోన్ సర్వీసుల్లో దేశంలో నెంబర్ వన్ బ్యాంక్ SBI అనేది తెలిసిందే.

అయితే అనేక సర్వీసులు ఖాతాదారుల కోసం తీసుకువస్తుంది SBI, తాజాగా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది..బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారి కోసం ఈ సర్వీసులు ఆవిష్కరించింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు, అలాగే ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ వాడే వారు వెంటనే ఈ సర్వీసులు పొందొచ్చు.

మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు అయితే, కచ్చితంగా మీరు మీ లావాదేవీలపై లిమిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. టోకనైజ్డ్ ట్రాన్సాక్షన్లపై కూడా లిమిట్ పెట్టుకోవచ్చు. పిన్ బేస్ట్ లావాదేవీలకు, నాన్ పిన్ బేస్డ్ లావాదేవీలకు ప్రత్యేకమైన లిమిట్ ఉంటుంది. ఇక ఎంత వరకూ అయినా స్వైప్ చేయడానికి ఉండదు, మీరు లిమిట్ పెట్టుకుంటే అంత వరకూ జరుగుతుంది, తర్వాత మీకు మెసేజ్ వస్తుంది.

డొమిస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు చూస్తే, ఆన్లైన్ ట్రాన్సాక్సన్లు, పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్లు, కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ట్రాన్సాక్షన్ల సర్వీసులను మీరు యాక్టీవేట్ చేసుకోవాలా లేదా అనేది కూడా మీకు ఆప్షన్ ఉంది, ఇంటర్నేషన్ ట్రాన్సాక్షన్ కావాలి అంటే మీరు బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టాలి. ఇక పిన్ పెట్టుకున్నా రోజుకి ఎన్ని లావాదేవీలు చేయాలి అనేది లిమిట్ పెట్టుకోవచ్చు, అంతేకాకుండా ఇంత వరకూ మాత్రమే విత్ డ్రా అనే లిమిట్ పెట్టుకోవచ్చు మీ ఖాతాకు…SBI ఖాతాదారులు సమీపంలో బ్రాంచీలో వీటి గురించి తెలుసుకోవచ్చు.