లెక్కుల చెప్పాల్సిన మాస్టారు లెక్క తప్పాడు… ఒకరిని కాదు ఇద్దరినికాదు ఏకంగా నలుగురుని వివాహం చేసుకున్నాడు ఈ సంఘటన గంటూరు జిల్లాలో జరిగింది…. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పంచాయితీ పరిధిలోని సౌత్ వల్లూరుకు చెందిన మహమ్మద్ బాజీ అలియాస్ షేక్ బాజీ అదే గ్రామాంలోని మండలపరిషత్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు…
తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి 2011లో తెలిసిన వ్యక్తుల ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన ఒక యవతిని వివాహం చేసుకున్నాడు కొద్దిరోజుల తర్వాత వేరే కాపురం పెడదామని చెప్పి విజయవాడలో ఓగదిని అద్దెకు తీసుకుని అక్కడే ఉండేవారు… వారం వారం వచ్చి వెళ్లేవాడు… ఆ తర్వాత మొహం చాటేశాడు దీంతో బాధితురాలు ఆరాతీయగా అసలు విషయం వెలుగు చూసింది…
దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది…. కృష్ణా జిల్లాకు చెందిన మరో యువతిని వివాహం చేసుకుని రహస్య కాపురం చేస్తున్నాడని తెలిసింది… ఇదేంటని నిలదీస్తే ఆమెని కొట్టాడు దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉంది రెండో భార్య… దీంతో పెద్దలందరు నిలదీయగా తన ఆస్తి మొత్తం రెండో భార్య పేరు మీద రాస్తానని చెప్పాడు… ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపాడు… ఇటీవలే దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ల బాలిక తల్లి దండ్రులకు 30 వేలు ఇచ్చి ఆ బాలికను వివాహం చేసుక్నాడు… దీంతో రెండో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు…