నిర్భయ దోషులకు ఉరి అని తెలియగానే వారు ఏం చేశారో చూడండి

నిర్భయ దోషులకు ఉరి అని తెలియగానే వారు ఏం చేశారో చూడండి

0
83

నిర్భయ దోషులకు పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో వారిని ఉరి తీయడానికి ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు సిద్దం అవుతున్నారు.. మరో 15 రోజుల్లో వారిని ఉరితీయనున్నారు… జనవరి 22న ఉదయం 7 గంటలకు వీరందరినీ ఉరి తీయాలని ఆదేశాలిచ్చింది కోర్టు.

అయితే ఈ వార్త తెలియగానే వారందరూ షాక్ అయ్యారు.. జీవితంలో చాలా తప్పు చేశాం అని బాధపడ్డారట సెల్ లో .. ఒంటరిగా ఎవరికి వారు బాధపడ్డారు, తాము బయటకు వస్తాము అని అనుకుంటున్నామని.. కాని ఉరి శిక్ష పడటంతో ఇక మా జీవితం జైలులోనే అని బాధపడ్డారు ఈ నలుగురు.

ఇక వారి కుటుంబ సభ్యులని కూడా ఒక్కసారి మాత్రమే కలిసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. తీర్పు రావడంతో ఉరితీతకు కావలసిన ఉరితాళ్లను, తలారీని ఏర్పాటు చేస్తున్నారు జైలు అధికారులు.. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మీరట్ కు చెందిన ఓ తలారిని సిద్ధం చేస్తున్నారు…దోషులు నలుగురిని జైల్లో ఒక్కో సెల్ లో ఉంచి వారిని సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.. ఇక వీరి నలుగురిని ఉరి తీసేందుకు అవసరమైన తాళ్లని ప్రత్యేకమైన బీహార్ లోని బక్సర్ జైలు నుంచి తెప్పిస్తున్నారు.