సెల్ఫీ మోజు – ఆ ప్రియుడు ప్రియురాలి కుటుంబంలో విషాదం నింపింది

సెల్ఫీ మోజు - ఆ ప్రియుడు ప్రియురాలి కుటుంబంలో విషాదం నింపింది

0
91

సెల్ఫీ మోజు చాలా మందిని బలి తీసుకుంటుంది.. ఈ ఫోటోలు వద్దు అంటున్నా కొందరు రిస్క్ చేసి మరీ స్టంట్లు చేసి ఫోటోలు కొన్ని డేంజర్ ప్లేస్ ల దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు, పక్కన ఏమీ పట్టించుకోకుండా వారి ప్రపంచంలో వారు ఉంటున్నారు. చివరకు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు…తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమ జంట ప్రాణాలు కోల్పోయింది.

 

కర్ణాటక రాష్ట్రంలో బీదర్ లోని పురుషోత్తం తన ప్రియురాలు రక్షిత ఇద్దరూ విహారయాత్రకు వెళ్లారు,

దాండేలి నుండి జోయిడా దగ్గర అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. ఈ సమయంలో సెల్ఫీ తీసుకున్నారు. అయితే ప్రమాదవశాత్తు జారి నదిలో పడిపోయారు, ఇద్దరికి ఈత రాదు దీంతో అక్కడే మునిగిపోయారు.

 

వంతెనపై దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబసభ్యులకు కొందరు సమాచారం అందించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు….మొత్తం వెతికినా కనిపించలేదు, కాని ఉదయం నదిలో రెండు మృతదేహాలు పైకి తేలాయి.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.