Flash: గల్లంతైన భారత జవాన్లు మృతి

Seven jawans killed in avalanche

0
93

అరుణాచల్‌ ప్రదేశ్‌లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు సైనికుల ఘటన విషాదకరంగా ముగిసింది. ఏడుగురు జవాన్లు మృతి చెందినట్టు భారత సైన్యం నిర్ధరించింది.. అయితే శనివారం వీరు గల్లంతు కాగా మంగళవారం మృతదేహాలు లభించాయని భారత సైన్యం తన ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతమైన కమెంగ్‌ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించి.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. తాజాగా వారి మృతదేహాలను గుర్తించినట్టు చెప్పారు.