మనం ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లిన సమయంలో కచ్చితంగా శకునం చూసుకుని వెళతాం, అంటే ఎదురుచూసుకుని వెళతాం, ఈ సమయంలో కొందరు వస్తే అస్సలు ముందుకు వెళ్లం, మరి శకునం సెంటిమెంట్ ఉన్నవారు ఏమి చూసుకుని వెళితే బెటర్ అనేది చూద్దాం.
గుడిలో గంట మోగిన శబ్దం వినిపిస్తే బయలుదేరవచ్చు. మంగళ వాయిద్యాలు వినిపించినా వారు ఎదురు పడినా వెళ్లవచ్చు, కొత్తగా వివాహం అయిన పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఎదురువచ్చినా వెళ్లవచ్చు, 16 రోజుల పండుగ ముందు వారు ఎవరికి ఎదురు వచ్చినా మంచిదే.
ఇక ఆవు ఎదురువస్తే ఏదైనా శుభం జరుగుతుంది, పిల్లి ఎదురు వస్తే వెళ్లకూడదు, పూలు పండ్లు తీసుకువస్తే వెళ్లవచ్చు, బూడిద గుమ్మడికాయ వస్తే వెళ్లకూడదు, ఆకుకూరలు బండి వచ్చినా వెళ్లకూడదు, కూరగాయలు పండ్లు ఎదురు వస్తే చాలా మంచిది, నీరు కారకుండా బిందె తీసుకువెళుతున్న మహిళ ఎదురు వచ్చినా వెళ్లవచ్చు.. గుర్రాలు ఎదురువస్తే శుభప్రదంగా భావించి తక్షణమే బయలుదేరవచ్చు. ఇక అందరికంటే తల్లి చెల్లి భార్య అక్క ఎదురు ఎంతో మంచిది.