దర్శకుడు గుణశేఖర్ చరిత్రకు సంబంధించిన సినిమాలు అంటే ఆయన పేరే వినిపిస్తుంది… రుద్రమ దేవి సినిమా ఓ అద్బుతం అని చెప్పాలి… ఇక ఇలాంటి చారిత్రక సినిమాలతో ఆయన బాగా మెప్పిస్తారు, ఇక తాజాగా ఆయన పౌరాణిక సినిమా శాకుంతలంపై దృష్టి సారించారు.
శకుంతల క్యారెక్టర్ చేయడానికి సమంత ఓకే అనేసింది. ఇటీవల చిత్ర యూనిట్ ఈ ప్రకటన చేసింది.. సమంత శకుంతలగా కనిపించనుంది, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.. మరి చిత్రంలో మెయిన్ రోల్ అయిన దుష్యంతుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు..
ఇక ఈ పాత్ర కోసం దగ్గుబాటి రానాని కలిశారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అంతేకాదు మరో పక్క తమిళ మలయాళ హీరోలని కూడా గుణశేఖర్ పరిశీలిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. మరి చూడాలి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారో.