శని దేవుడికి ఎంతో విశిష్టమైన స్థానముంది. అందుకే శని గ్రహం ప్రభావం ఉంటే కచ్చితంగా ఆ శనీశ్వరుడ్ని పూజిస్తూ ఉంటారు. ప్రతీ శనీవారం శనికి తైలాభిషేకం అలాగే ఉపవాసం ఉంటారు. ఇక శనిగ్రహం చూపు తమపై ఉండకూడదు అని చాలా మంది పూజలు చేస్తారు. శని అమావాస్య, అలాగే శనీశ్వరుడి జయంతి రోజున ఆయనకు పూజలు చేస్తే ఆయన కృప మనపై ఉంటుందంటున్నారు పండితులు.
శని అమావాస్య రోజున ఈ పనులు చేస్తే ఎంతో మంచిది.
ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి తలారాస్నానం ఆచరించాలి.
శుభ్రమైన బట్టలు ధరించాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి ఆయనను పూజించాలి
శనిదేవుడికి తైలాభిషేకం, అరటిపండ్లు, బెల్లం సమర్పించాలి
ఇక నల్లటి వస్త్రం స్వామి పాదాల దగ్గర లేదా కండువాగా వేయాలి
ఇక నల్లటి నువ్వులని స్వామికి తలపై నుంచి అభిషేకంగా చేయాలి
ఇక నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం
కచ్చితంగా ఆ రోజు బ్రహ్మచర్యాన్ని కొనసాగించండి
నువ్వుల నూనెతో ఇత్తడి లేదా మట్టి దీపం వెలిగించండి
ఒకపూట మాత్రమే భోజనం చేసి మరో పూట ఉపవాసం ఉండండి.