శనీశ్వరుడిని ఈ 9 విధాలుగా పూజిస్తే మీ శని బాధలు తొలగిపోతాయి

శనీశ్వరుడిని ఈ 9 విధాలుగా పూజిస్తే మీ శని బాధలు తొలగిపోతాయి

0
127

శని బాధలు ఉంటే శనైశ్చరుడుకి ప్రతీ శనివారం నువ్వుల నూనెతో అభిషేకం చేయండి.. ఏ శని బాధలు ఉన్నా తొలగిపోతాయి, అలాగే శనివారం కచ్చితంగా నువ్వులు దానం చేయాలి, అలాగే నువ్వులతో అభిషేకం చేయిస్తే మంచిది..
శనికి నలుపు రంగు అంటే ఇష్టం. ఆయన వాహనం నల్లగా ఉండే కాకి. నల్లని నువ్వులు, నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్లని వస్త్రాన్ని ధరింపజేసి ఆయనకు పూజలు చేస్తే చాలా మంచిది.

ఇక ఆయనకు ఏ పువ్వులు ఇవ్వాలి అంటే ,వంగపండు రంగు పువ్వులతో పూజిస్తే మంచిది, ఇక అరటి కొబ్బరి నైవేద్యంగా ఇవ్వచ్చు, అలాగే నల్ల బెల్లం తాటి బెల్లం ఇచ్చినా మంచిదే ..శనికి ఎప్పుడూ కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఆయన చూపులు తీక్షణంగా ఉండటంవలన ఆ చూపులను తట్టుకునే శక్తి మనకు ఉండదు, అందుకే పక్కకు ఉండి శనిని పూజించాలి.

శనివారం త్రయోధశి కలిసి వస్తే ఆరోజు శనికి పూజలు చేస్తే చాలా మంచిది. ఈరోజు శనిబాధ ఉన్న వారు నూనె కొనడం దానం చేయడం చేయవద్దు, ఇక ఉపవాసం ఉండి శనీశ్వరుడ్ని ఉదయం సాయంత్రం పూజించండి వల్ల ఎంతో మంచి జరుగుతుంది.