ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించింది, భర్త మంచివాడు అనుకుంది, చివరకు మొదటి రాత్రి ఎంతో ఆనందంగా ఉంటుంది అని అనుకుంది, కాని అదే ఆమెకి చివరి రాత్రి అయింది, కుటుంబం కూడా ఇలాంటి స్దితి తమ కూతురికి వస్తుంది అని అనుకోలేదు.
తిరువళ్లూర్ జిల్లా సెమ్మంజేరికి చెందిన నీతివాసన్కు చెన్నై తిరువొత్తియూర్కు చెందిన సత్యతో వివాహం జరిగింది. గురువారం వేకువజామున గది నుంచి నీతివాసన్ హడావుడిగా బయటకు వెళ్లిపోవడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. వారు గదిలోకి వెళ్లి చూడగా నవ వధువు రక్తపుమడుగులో పడివుంది. దీంతో ఏమైందో తెలుసుకునేలోపే ఇంట్లో రోదనలు.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు, అయితే ఇలా అతనిని వెతుకుతున్న సమయంలో అతడు ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరేసుకొని వుండడాన్ని గుర్తించారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో తగాదా వచ్చి ఇలా జరిగి ఉంటుంది అని, వారి ఇద్దరి హిస్టరీ ప్రేమ వ్యవహారాలు ఇలాఏమైనాఉన్నాయా అని పరిశీలిస్తున్నారు విచారణ చేస్తున్నారు..