దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలు అధికంగా పెంచి సామాన్యులపై అదనపు భారం వేసాయి. రోజు రోజుకి గ్యాస్ సిలిండర్ ధరలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచి వినియోగదారులకు కోలుకొని షాక్ ఇచ్చింది.
గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచి షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర 1052 రూపాయలకు చేరింది. ఈ పెరిగిన ధరలు ఇప్పటికే అమలు లోకి రావడంతో మహిళలు గ్యాస్ కంటే పొయ్యి మీద వండుకోవడమే మేలని అభిప్రాయపడుతున్నారు.